Sankranthi Bhogi Kanuma Kavithalu in Telugu.
తెలుగు వారి అతి ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఊరు కొత్త సందడిని సంతరించుకుంటుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఊరికి చేరుకుంటారు. ఇంటికి చేరిన ధాన్యపు సిరులు, ఇంటి ముందు రంగవల్లులు, వాటి మధ్యలో గోబ్బెమ్మలు, హరిదాసుల ఆలాపనలు, ముంగిట నిలిచిన బసవన్నలు, పిండి వంటలు, గాలి పటాలు, చిన్న పిల్లల కేరింతలు, కన్నె పిల్ల అందాలు, కొత్త అల్లుళ్ళ కొంటెతనాలు, ఆట రాయుళ్ళ ఆర్భాటాలు, భోగి – సంక్రాంతి – కనుమ మూడు దినాలు, అందించే పోతాయి సంవత్సరానికి సరిపడా జ్ఞాపకాలు.
అలాంటి సంక్రాంతిని మీకు మరింత జ్ఞాపకంగా మారాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సంక్రాంతిని మీ వారితో మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మీ సంతోషాలను మీ వారితో పంచుకోవడానికి మా ఈ Sankranthi Bhogi Kanuma Kavithalu ఉపయోగ పడతాయని మా అభిలాష.

ఈ భోగీ మీకు భోగభాగ్యాలను అందించాలి. మీ కష్టాలన్నింటిని దహించి వేయాలని మనసారా కోరుకుంటూ… మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
Ee bhogi meeku bhogabhagyaalanu andinchaali. Mee kashtaalannintini dahinchi veyaalani manasaaraa korukuntoo… meeku mee kutumba sabhyulaku Bhogi pandaga subhakankshalu.

ఈ భోగి మీకు సకల భాగ్యాలను అందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు…
Ee Bhogi meeku sakala bhagyaalanu andinchaalani aa devunni korukuntoo… Meeku, Mee kutumba sabhyulaku Bhogi Subhakankshalu…
Makara Sankranthi Kavithalu in Telugu.

భోగి మంటల సందళ్లు, రంగవల్లుల నడుమ గొబ్బిళ్ళు, కొత్త బియ్యపు పొంగళ్ళు, అందరి మది ఆనంద పరవళ్ళు. ఈ సంక్రాంతి మీ జీవితల్లో కొత్త కాంతులు నింపాలని ఆశిస్తూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
Bhogi mantala sandallu, Rangavallula naduma gobbillu, Kotaa biyyapu pongallu, Andari madi aananda paravallu. Ee sankranti mee jeevatallo kotta kaantluau nimpaalani ashistoo… Meeku, Mee kutumbaniki Sankranti Subhakankshalu…

ముంగిళ్ళలో మెరిసే రంగవల్లులు, తెలుగుదనానికి తలమానికగా నిలిచే ప్రతి ఇల్లు, మనవాళ్లను దగ్గరకి చేర్చే మూడు రోజులు మీ జీవితాల్లో మరిన్ని జ్ఞాపకాలని అందించాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
Mungillalo murise rangavallulu, Telugudanaaniki talamaanikagaa niliche prati illu, Manavaalanu daggaraki cherche ee moodu rojulu mee jeevitallo marinni gnapakaalani andinchaalani korukuntoo… Meeku, Mee kutumbaniki Sankranti Subhakankshalu…

ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతులను నింపాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
Ee Sankranti mee jeevitallo kotta kantulanu nimpaalani manasaaraa korukuntoo… Meeku, Mee kutumbaniki Sankranti Subhakankshalu…
చేరుకులోని తియ్యదనం, పాలలోని తెల్లదనం, ధాన్యపు సిరుల నిండుతనం, మీ జీవితాల్లో కూడా నిండుగా ఉండాలని ఆశిస్తూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
Cherukuloni tiyyadanam, Paalaloni telladanam, Dhanyapu sirula nindutanam, Mee jeevitallo kudaa nindugaa undaalani aashistoo… Meeku, Mee kutumbaniki Sankranti Subhakankshalu…
ఈ భోగి మీకు సకల భోగ భాగ్యాలు అందించాలి, సంక్రాంతి సర్వ సుఖాలను అందించాలి, కనుమ కష్టాలను తొలగించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
Ee Bhogi meeku sakala bhoga bhagyalu andinchaali, Sankranti sarva sukhaalanu andinchaali, Kanuma kashtaalanu tolaginchaalani aa bhagavantunni korukuntoo… Meeku, Mee kutumbaniki Sankranti Subhakankshalu…
Sankranthi Bhogi Kanuma Kavithalu in English.
భోగిమంటల వెచ్చదనంతో, పిండివంటల కమ్మదనంతో, వాకిట వెలసిన రంగవల్లులతో, వాటి నడుమ మురిసిన గోబ్బెమ్మలతో, సందడి చేసే బసవన్నలతో, వాకిట నిలిచిన హరిదాసులతో, పల్లె అందంగా ముస్తాబైన వేళ… మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
Bhogimantala vechadanamtho, Pindivantala kammadanamtho, Vaakita velasina rangavallulatho, vaati naduma murisina gobbemmalatho, sandadi chese basavannalatho, vaakita nilichina haridasulatho, palle andangaa mustaabaina vela… Meeku, Mee kutumbaniki Sankranti Subhakankshalu…
భోగి భోగభాగ్యాలని, సంక్రాంతి సుఖసంతోషాలని, కనుమ కమ్మని అనుభూతులని మీకు అందించాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
Bhogi Bhogabhagyalani, Sankranti sukhasantoshaalani, Kanuma kammani anubhootulani meeku andinchaalani manasaaraa korukuntoo… Meeku, Mee kutumbaniki Sankranti Subhakankshalu…